back

వరుణ్ అంతరిక్షం డిసెంబర్ లో రిలీజ్ అవుతుందా ..?



Share via:

దర్శకుడు క్రిష్ మరియు కంచే ఫేం రాజీవ్ రెడ్డి సంయుక్త నిర్మాణంలో 'ఘాజి' తో అవార్డ్స్ అందుకున్న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో తెలుగులో వస్తున్న మొట్టమొదటి అంతరిక్షంకి సంబంధించిన సినిమానే “అంతరిక్షం 90000 కెఎంపిహెచ్”.

ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసిన సమయంలో డిసెంబర్ 21 రిలీజ్ అని అనౌన్సు చేసిన సినిమా నిర్మాత తర్వాత సినిమాకి సంబంధించి ఎటువంటి విషయం కూడా వెల్లడించలేదు!

తీరా చూస్తే రిలీజ్ కు పాతిక రోజుల సమయం కూడా లేదు. ప్రమోషన్ హడావిడి ఏమి కనిపించడం లేదు. ట్రైలర్-ఆడియో-ప్రీ రిలీజ్-మీడియా ఇంటర్వ్యూస్ ఇలా చాలా పనులు మొదలుపెట్టనే లేదు. టైం ఉంది కదా అని చెప్పేందుకు లేదు. మరోవైపు కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో ఎఫ్2 విడుదల కావడం పట్ల వరుణ్ తేజ్ హ్యాపీగా లేడని ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో అంతరిక్షం టీమ్ ఇంత సైలెంట్ గా ఉండటం కూడా కొత్త అనుమానాలు రేపుతోంది. అందులో అదే సమయానికి చాల సినిమాలు లైన్ లో ఉండడంతో ఈ సినిమా ఏమైనా వాయిదా పడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

Tags : Varun Tej, Antariksham 9000 KMPH

Write a comment ...
Post comment
Cancel