back

సైరా 2019 లో రిలీజ్ అవుతుందా ...



Share via:

భారీ గ్రాఫిక్స్ తో ముడిపడిన ఏ సినిమా కూడా చెప్పిన టైంకి రిలీజ్ అయిన దాఖాలాలు ఇప్పటివరకు లేవు. అంజి తో మొదులుపెడితే అరుంధతి, బాహుబలి, రోబో 2.0 ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ.. దీనికి చాల కారణాలు ఉన్నాయి, అందులో ముఖ్యంగా గ్రాఫిక్స్ ని ఊహిస్తూ చేయాల్సిన షూటింగ్ ఆలస్యం అవ్వడం అలాగే ఎన్నో ఫ్రేమ్స్ తో చేయాల్సిన గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడం. మరి ఇలా ఎంతో మంది మీద డిపెండ్ అయిన ఇలాంటి సినిమాలు అనుకున్న టైంకి రిలీజ్ చేయడం అంటే అంతా సులభం కాదు. ఏ మాత్రం తేడా వచ్చిన నెలల తరబడి ఆలస్యం అవుతాయి. దానికి ఉదాహరణ నిన్న రిలీజ్ అయిన 2.0. ఈ సినిమా చెప్పిన డేట్ కి సుమారు ఒకటిన్నర్ర సంవత్సరం ఆలస్యంగా రిలీజ్ అయింది.


ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కుంటోంది మెగాస్టార్ చిరనజీవి నటిస్తున్న ‘సైరా’ సినిమా. చాలా వరకు సినిమాలో గ్రాఫిక్స్ వాడుతున్దడంతో ఈ సినిమా చెప్పినట్లు మేనెలలో రిలీజ్ అవ్వడం డౌట్ అంటున్నారు. ఎందుకైనా మంచిదని ఆగష్టు 15 ని కూడా అనుకుంటున్నారు కాని, క్వాలిటీ గ్రాఫిక్స్ కావాలంటే ఈ సమయం సరిపోతుందా అనే సందేహం వస్తుంది. మరి ఇక ఆగష్టు మిస్ అయితే దసరా కొ దీపావళి కొ రావాలి. కాని అప్పుడు దేశవ్యాప్తంగా భారీ పోటీ ఉంటుంది. నిర్మాతగా రామచరణ్ కి ఇది పెద్ద పరీక్షే..!

Tags : Syeraa, Ram Charan, Chiranjeevi, Syera Release Date

Write a comment ...
Post comment
Cancel