back

నైజాం లో రంగస్థలం 25 కోట్లు సాధిస్తుందా ..?



Share via:

రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమా నైజాం ప్రాంత ప్రజలను ఎంతగా ఆకట్టుకుంది అనేది కలెక్షన్స్ నిరుపిస్తున్నాయి. మొదటి వారంలోనే రికార్డ్ స్థాయి షేర్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.21.20 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుని త్వరలోనే రూ. 25 కోట్లను అందుకునేలా కనిపిస్తోంది.

: మెగా హీరోలంతా ఒకే వేదిక పైన ...!

రామ్ చరణ్ కెరీర్లోనే భారీ బ్లాక్ బస్టర్ గా రికార్డులకెక్కిన ‘మగధీర’ నైజాం లో రూ.22.64 కోట్ల తర్వాత ఆ స్థాయి కలెక్షన్లను పొందిన చిత్రంగా ‘రంగస్థలం’ నిలిచింది. ఈ వారం లోనే మగధీర రికార్డ్ని కూడా బద్దలు అవ్వడం కాయం అని ట్రేడ్ వర్గాల మాట. నైజాం లో 25 కోట్ల మార్కుని మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ఎప్పుడో సాధించేసారు కాని రాంచరణ్ కి అది ఇప్పుడు సాధ్యం అయ్యేలానే ఉంది. కొద్ది రోజుల్లో రంగస్థలం అది సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు.

Tags : Rangasthalam in Nizam, Rangasthalam Collections, Mega Power Star, Ram Charan, Samantha, Sukumar

Write a comment ...
Post comment
Cancel