back

రామ్ చరణ్ దేనా ఈ సంక్రాంతి ..!



Share via:

ఈ సంవత్సరం సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలకృష్ణ నటిస్తోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ “కథానాయకుడు” పైన ఆసక్తి బాగానే వుంది. అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన 'ఎఫ్2' కూడా మంచి కామెడీ అనే ఫీలింగ్ తెచ్చింది. 'వినయ విధేయ రామ' మాత్రం రెగ్యులర్ బోయపాటి మార్కు మాస్ మసాలా చిత్రంలా అనిపిస్తోంది, అలాగే ఇదే కోవ లోకే చెందిన రజనీకాంత్ సినిమా ‘పేట’. అయితే ఈ నాలిగింట్లోను 'వినయ విధేయ రామ'కే మార్కెట్ వర్గాలనుంచి ఎక్కువ మద్దతు వస్తుంది. మామూలుగా సంక్రాంతి మాస్ మసాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లే ఎక్కువ విజయాలు సాధించాయి. రాంచరణ్ సినిమా అచ్చు అదే కోవకి చెందిన సినిమా అవ్వడం, రంగస్థలం విజయం ఎఫెక్ట్ మరియు బోయపాటి ఇంపాక్ట్ అని కలిపి ఈ సినిమానే సంక్రాంతి పోటీలో విజయం సాధిస్తుంది అంటున్నారు సినిమా జనాలు.

ఫొటోస్: వినయ విధేయ రామ HD పోస్టర్స్


ఈ చిత్రానికి ఎగ్జిబిటర్ల నుంచి వస్తోన్న ఫిక్స్డ్ హైర్లు, షేర్ గ్యారెంటీలు మిగతా సినిమాలకి రావడం లేదు. మిగిలిన చిత్రాల రేంజ్ ఒక స్థాయికి పరిమితం అవుతుందని, వినయ విధేయ రామకి మాత్రం బాక్సాఫీస్ని శాసించే సత్తా వుందని ట్రేడ్ వర్గాల వారు విశ్వసిస్తున్నారు. విడుదలైన తర్వాత ఏ సినిమా ఎక్కువ బాగుందనేదే విజయాన్ని డిసైడ్ చేస్తుంది కానీ విడుదలకి ముందు హంగామాలో మాత్రం 'వినయ విధేయ రామ' సందడిని మ్యాచ్ చేయడం మిగతా సీనియర్ హీరోల సినిమాల వల్ల కావట్లేదు.

రాంచరణ్ సీక్రెట్ ని చెప్పేసిన కియారా అద్వాని

Tags : Ram Charan, Boyapati Sreenu, VVR, Sankranthi

Write a comment ...
Post comment
Cancel