back

RRR ప్రారంభోత్సవానికి ఎందుకంత హంగామా..



Share via:

ఇప్పుడు దేశంలో ఎస్.ఎస్.రాజమౌళి అంటేనే ఒక బ్రాండ్. అలాంటిది నిన్న జరిగిన RRR సినిమా ప్రారంభోత్సవానికి చాలా హంగామా చేసారు సినిమా యూనిట్. చాలా మంది అతిథులతో అద్భుతంగా ఆలంకిరించిన వేదిక పైన పూజ కార్యక్రమాలు చేసారు. అయితే లోకల్ మీడియా నుంచి జాతీయ మీడియా వరకూ ప్రతిదీ విజువల్స్ రూపంలో - ఫోటోల రూపంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ స్వయంగా అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా ప్రమోట్ చేసింది. ఈ ఈవెంట్ కి దాదాపు 30 మంది అతిధులు ఎటెండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి - ప్రభాస్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన వేడుక ఇది.

ఫొటోస్: #RRR మూవీ లాంచ్ | HD ఫొటోస్

అయితే ఈ వేడుకకు ఎందుకంత ప్రాముఖ్యత అంటే.. కేవలం జాతీయ మీడియాని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు రేంజును ఎలివేట్ చేసేందుకేనని అంటున్నారు. మోస్ట్ అవైటెడ్ సినిమా అన్న సంకేతాల్ని ఇండస్ట్రీ వర్గాల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. ఈ ఈవెంట్ గెస్టులతో పాటు చిత్ర యూనిట్ అందరినీ మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ - తారక్ ప్రత్యేకించి చేయి కలిపి ఆహ్వానించారు. ఆ మొత్తం దృశ్యాల్ని వీడియో ఫుటేజ్ లో చిత్రీకరించి దానయ్య మీడియా సామాజిక మాధ్యమాల్లో అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో జోరుగా వైరల్ అవుతోంది. బాహుబలి లాగానే ఈ భారీ ప్రాజెక్టు మొత్తానికి రాజమౌళి మాత్రమే ఎగ్జిక్యూషన్ చేస్తారట. దర్శకత్వం సహా ప్రతిదీ రాజమౌళి - అతడితో ఉండే బృందం గుండు సూది నుంచి లంచ్ బాక్స్ వరకూ - ప్రాజెక్టు కు సంబంధించిన ప్రతి వ్యవహారం చూసుకుంటారట. నిర్మాత అని చెబుతున్న.. డి.వి.వి.దానయ్య కేవలం ఫైనాన్షియర్ గా మాత్రమే కొనసాగుతారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం - సేఫ్ గా బిజినెస్ చేసి పెట్టడం - లాభాల్ని చేతిలో పెట్టడం రాజమౌళి ఇచ్చిన కమిట్ మెంట్ అన్న మాటా వినిపిస్తోంది. ఇక కథానాయకులు రామ్ చరణ్ - ఎన్టీఆర్ పారితోషికాల బేసిస్ లో కాకుండా లాభాల్లో వాటా ప్రాతిపదికన నటిస్తున్నారని తెలుస్తోంది.

ఈ నెల 19న అల్లుమినియం ఫ్యాక్టరీ లో వేసిన సెట్స్ లో ఎన్టీఆర్-చరణ్ ల మీద తీసే యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలుపెడతారట. ఇంకా పూర్తిగా నటీనటులను ఫైనల్ చేయనందున తర్వాతి షెడ్యూల్ పైన పూర్తి క్లారిటీ లేదు. 300 కోట్ల బడ్జెట్ కనుక రాజమౌళి రెండేళ్ల పైనే ఈ సినిమా తీస్తాడని అనిపిస్తుంది.

Tags : RRR Movie Opening, Rajamouli, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel