back

బన్నీ ఎందుకిలా..? ఏమైంది ..?



Share via:

ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ స్టేటస్ కలిగిన ఒక అర డజను మంది హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. వరుసగా సినిమాలు తీస్తూ తన క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు ఈ స్టైలిష్ స్టార్.

తెలుగే కాక మలయాళంలో కుడా బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే హిందీలో బన్నీ సినిమాలు యుట్యుబ్ లో తెగ వ్యూస్ తేచ్చుకుంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో బన్నీ సుమారు 7 నెలలు విరామంలోనే ఉన్నాడు. నా పేరు సూర్య రిలీజ్ అయ్యి 7 నెలలు అవుతుంది. అప్పటినుంచి బన్నీ సినిమా అంటూ విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ పేర్లు వినిపించాయి... కాని ఇప్పటికీ ఒక్క ప్రకటన కుడా రాలేదు.


ఎందుకిలా ..? అంటే , కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి.
* 15 సంవత్సరాలుగా అంటే గంగోత్రి 2003 లో రిలీజ్ అయినప్పటి నుండి విరామం లేకుండా సినిమాలు తీసిన అల్లు అర్జున్ కొంత కాలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గడపాలని అనుకోవడం.
* కమర్షియల్ గా పర్లేదు అనిపించినా దువ్వాడ జగన్నాధం మరియు నా పేరు సూర్య సినిమాలు నిరాశ పరచడంతో కొంత కాలం గ్యాప్ తీసుకుంటే బెటర్ అనుకున్నాడేమో. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కుడా ఇలాగే వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నారు.

* ఈ సారి తీసే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తుంది.

మరి కారణం ఏదైనా తనకి పోటీదారులైన ఇద్దరు హీరోలు ఎన్టీఆర్ - చరణ్ లు రెండేళ్ల వరకు ఒకే సినిమాకి కమిట్ అయిపోయారు. ఈ సమయంలో తాను వేగం పెంచి ఎక్కువ సినిమాలు చేయాల్సింది పోయి అల్లు అర్జున్ ఖాళీగా కూర్చుంటున్నాడు.

ఈ టైం ని అల్లు అర్జున్ అనుకూలంగా మార్చుకోకుండా సెల్ఫ్ డౌట్స్ తో కాలయాపన చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. మరి బన్నీ అభిమానుల కోరిక తొందరలో తీరుస్తాడో లేదో...


Tags : Allu Arjun, Next Movie

Write a comment ...
Post comment
Cancel