back

మెగా హీరోలు ఇప్పుడు ఏం చేస్తున్నారు....?Share via:

సుమారు 8 మంది హీరోలతో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అతి పెద్ద సినిమా ఫ్యామిలీగా మారింది చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ. మరి వారంతా ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం...

మెగాస్టార్ చిరంజీవి :
సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి అదే సమయంలో తన తీయబోయే కొత్త సినిమా కథా చర్చల్లో కోరటాలతో చర్చిస్తున్నారు. ఇదే కాక ఈ మధ్య గాడి తప్పిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కెరీర్ని కూడా సెట్ చేసే పనిలో ఉన్నాడని టాక్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ :
సినిమాలు వదిలేసి పూర్తిగా ప్రజా సేవ కోసం సంపూర్తిగా రాజకీయాల్లోకి దిగిపోయిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజా పోరాట యాత్ర లో భాగంగా అనంతపురంలో తిరుగుతున్న పవన్, వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ :
వరుస విజయాలతో దూకుడు మీదున్న సమయంలో వచ్చిన పరాజయంతో కొంత గ్యాప్ తీసుకున్న బన్నీ మళ్ళి కొద్ది రోజుల్లో త్రివిక్రమ్ తో తీయేబోయే సినిమాతో మేక్ అప్ వేసుకోనున్నాడు. ఈ బ్రేక్ తీసుకున్న 7 నెలల కాలంలో ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించిన బన్నీ, సొంతంగా ఆఫీస్ కుడా ఓపెన్ చేసాడు. తొందరలో సొంత బానేర్ పైన చిన్న సినిమాలు తీయబోతున్నాడని టాక్.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ :
మెగా ఫ్యామిలీ లోనే కాక మొత్తం ఇండస్ట్రీలోనే అంత్యంత బిజీగా ఉన్న స్టార్ రామ్ చరణ్.. సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ “సైరా” పనులు చూసుకుంటేనే, నెక్స్ట్ సినిమా కథా చర్చల కోసం కోరటాలతో చర్చిస్తున్నారు. ఇక తన సినిమా RRR మరియు వినయ విధేయ రామ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ఈ వారంలోనే శబరిమల ప్రయాణం కూడా ఉందని తెలుస్తుంది.

సాయి ధరం తేజ్ :
వరుస అపజయాలతో డీలా పడిన సాయి, ఎలాగైనా హిట్ కొట్టాలని నేను శైలజ ఫేం కిశోర్ తిరుమలతో తీస్తున్న సినిమా ‘చిత్రలహరి’. ఈ సినిమాకి సంబంధించి అల్లుడి కోసం చిరంజీవి కూడా రంగంలోకి దిగి కథ కథనం విషయం మార్పులు సూచించారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

వరుణ్ తేజ్ :
రామ్ చరణ్ తరువాత అత్యంత బిజీ గా ఉన్నది వరుణ్ తేజ్. ఒక వైపు ప్రయోగాత్మక చిత్రం అంతరిక్షం మరో వైపు వెంకటేష్ తో కలిసి F2. ఇలా రెండు షూటింగ్ లతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఇక తన తర్వాతి సినిమాని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నాడని టాక్.

అల్లు శిరీష్ & కళ్యాణ్ దేవ్ :
అల్లు శిరీష్ కూడా తన తర్వాతి చిత్రాన్ని లైన్లో పెట్టాడు. ప్రస్తుతం శిరిష్ మలయాళంలో ఘన విజయం సాదించిన 'ఏబిసిడి' చిత్ర తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక విజేతతో సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమాని లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక నాగబాబు గారు సినిమాలు, జబర్దస్త్ మరియు సీరియల్స్ తో బిజీగా ఉన్నారు. రకరకాల ప్రయత్నాల్లో నిహారిక, సైరా కాస్ట్యూమ్స్ పనిలో సుష్మిత బిజీగా ఉన్నారు.

మరిన్ని మెగా ఫ్యామిలీ అప్డేట్ల కోసం మా వెబ్ సైట్ చూస్తూ ఉండండి.

Tags : Mega Heroes, Megastar Chiranjeevi, Power Star Pawan Kalyan, Stylish Star Allu Arjun, Mega Power Star Ram Charan, Supreme Hero Sai Dharam Tej, Allu Sirish, Mega Prince Varun Tej, Nagababu, Kalyan Dhev

Write a comment ...
Post comment
Cancel