back

కొత్తగా ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్నాం - రాంచరణ్



Share via:

కొంత కాలంగా ఎటువంటి బ్రాండ్స్ కి ప్రకటనలు ఇవ్వకుండా ఉన్న రాంచరణ్ ఇప్పుడు వరుసగా చేయాలనీ నిర్ణయించారు. నిన్న జరిగిన హ్యాపీ మొబైల్స్ లాంచింగ్ ఈవెంట్లో తన మనసులో మాట బయటపెట్టాడు.

“గత దశాబ్దకాలంగా చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పేదవారికి సేవలు అందిస్తున్నాం. మాకు అందుతున్న పారితోషికంలో కొంత మొత్తాన్ని దీనికి ఇస్తున్నాం. ఇప్పటి వరకు బయటివారి నుంచి ఏ విధమైన ఫండ్స్‌ని తీసుకోకుండా దీన్ని నిర్వహిస్తున్నాం. ఆ ట్రస్ట్ ఎక్కువగా రక్తం మరియు కంటికి సంబంధించిన వాటికే ఉపయోగపడుతుంది. అయితే మరింత ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీన్ని అభిమానులకు అంకితం చేస్తాం. సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇస్తున్నాం. ఇకపైన మేము చేయబోయే ప్రకటనల ద్వారా వచ్చే దాంట్లో 20% మొత్తాన్ని కొత్త ట్రస్ట్ కి ఇచ్చి దానితో నడుపుతం. ఈ ఫౌండేషన్‌ ఆలోచన నాన్నగారిదే”

Tags : Ram Charan, Mega Power Star, Happi Mobiles, Chiranjeevi, Charitable Trust

Write a comment ...
Post comment
Cancel