back

రివ్యూ : వినయ విదేయ రామ - రాంచరణ్ కాపాడాల్సిందే.!Share via:

దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : డివివి దానయ్య
నటీనటులు : రామ్ చరణ్, కియార అద్వానీ, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : రిషి పంజాబీ & ఆర్థర్ ఏ విల్సన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు

‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్స్ సాధించిన మెగా పవర్ స్టార్ రామ్చరణ్ మొట్ట మొదటి సారి ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘వినయ విధేయ రామ’. టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి కానుకగా నేడు(జనవరి 11న) విడుదలైంది. మరి ఈ వినయ విధేయ రామ ఏ మేరకు మాస్ ప్రేక్షకులను మెప్పించాడో ఇప్పుడు చూద్దాం.


కథ :

అనాధలైన ఓ నలుగురు రామ్ ని చేరదీసి అందరు కలిసి ఒక కుటుంభంగా జీవిస్తుంటారు. ఆ కుటుంభం మరియు తన అన్నలకి ఎటువంటి కష్టం వచ్చిన ధైర్యంగా నిలబడిన రామ్ కథే ఈ ‘వినయ విధేయ రామ’. ఇక పూర్తి కథని మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

వీడియో : వివిఆర్ థీయేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం

ప్లస్ పాయింట్స్ :

రాంచరణ్ - మామూలు సీన్ ని కూడా తన స్క్రీన్ అప్పియరెన్స్ తో బాగున్నట్లు చేసాడు. తన గ్రేస్ఫుల్ స్టెప్స్ తో పాటలకి ప్రాణం పోసాడు.
ఫస్ట్ హాఫ్
రిచ్ విసువల్స్
ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్
ఫైట్లు తీసిన విధానం

మైనస్ పాయింట్స్ :

అదే పాత కాలపు రివెంజ్ స్టొరీ
పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
సెకండ్ హాఫ్

విశ్లేషణ :

పెద్దగా కొత్తధనం లేకుండా అదే పాత చింతకాయ స్టోరీస్ ని తీసుకుని తనదైన మేకింగ్ తో మాస్ ని ఆకట్టుకుంటున్న బోయపాటి ,మళ్ళి అలాంటి సినిమానే తీసాడు. తనకే చేతయ్యే అధ్బుతమైన హీరో ఎలవేషన్ సీన్లు, భారీ ఎమోషన్స్, అతి భారీ యాక్షన్ సీన్లతో సినిమాని నిమ్పెసాడు. అయితే కథ మాత్రం మరీ రొటీన్ కావడం ఎటువంటి ట్విస్ట్ లేకపోవడం పెద్ద మైనస్ అయింది. దేవిశ్రీప్రసాద్ సంపూర్తిగా ఫెయిల్ అయిన సినిమాగా దీనిని చెప్పుకోవచ్చు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి, ఖర్చు సినిమాలో కనిపిస్తుంది. ఇక ప్రతి పాత్రధారి తన స్కోప్ ఉన్నంతవరకు బాగానే చేసారు. అయితే మామూలుగా బోయపాటి సినిమాలో ఉండే భయంకరమైన విలన్ మిస్ అయ్యాడని చెప్పచ్చు, వివేక్ ఒబెరాయ్ బాగానే చేసాడు కాని ఆ పాత్రని మలచిన తీరు అంత భీబత్సంగా లేదు. ఈ మొత్తం సినిమాని ఎవరైనా కాపాడారు అంటే అది రాంచరణ్. కండల తిరిగిన దేహంతో ఏ విధంగా సినిమాలో కుటుంబాన్ని కాపాడుకుంటాడో అలాగే ఈ సినిమాని కూడా తన నటనతో ఒంటి చేత్తో నిలబెట్టాడు. అయితే ‘బి’. ‘సి’ సెంటర్లకు కావలసినవి అన్ని ఈ సినిమాలో ఉన్నాయి, అందులో పెద్ద పండగ సమయం కాబట్టి ఈ సినిమా సేఫ్ గా బయటపడుతుందని చెప్పచ్చు.

ముగింపు : ఈ సంక్రాంతికి రాంచరణ్ కోసం చూడాల్సిందే .

Tags : Ram charan, Vinaya Vidheya Rama Review, VVR, Boyapati sreenu

Write a comment ...
Post comment
Cancel