back

ట్రైలర్ రివ్యూ : వినయ విధేయ రామ



Share via:

బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం అంటూ ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా, వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొత్త సినిమా ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసాక రాంచరణ్ మళ్ళి మామూలు మాస్ సినిమానే ఎంచుకున్నాడు అనిపిస్తున్న కుడా, ఈ సారి రాంచరణ్లో కొత్త కోణాన్ని బోయపాటి ఆవిష్కరించాడా అనేలా ఉంది చరణ్ యాక్షన్.

ట్రైలర్ మొదట్లోనే చరణ్ రౌడీల తుక్కు రేగ్గోడుతుంటాడు... తరువాత నాలుగైదు ఫ్యామిలీ షాట్స్ వెంటనే యాక్షన్ లోకసీన్ి వెళ్ళిపోయాడు బోయపాటి. అజర్ బైజాన్లో హల్క్ లుక్ లో ఉన్న చరణ్  "సరైన సింహం తగలనంతవరకూ ప్రతి వేటగాడు మగాడేరా... నాకు నీలా సైన్యం లేదు. ఒంట్లో బెరుకు లేదు.. చావంటే అస్సలు భయం లేదు" అంటూ "బై బర్తే డెత్తును గెలిచొచ్చా.. రా" అని ఓ ఊరమాస్ డైలాగ్ చెప్తాడు.

 

విలన్ వివేక్ ఒబెరాయ్ ఇంట్రోలో కూడా పవర్ ఫుల్ గా "ఈ ప్రాంతంలో ఓటయినా మాటయినా తూటా అయినా.. నాదే" ఈ డైలాగ్ తో తనెంత డేంజరో చెప్పేస్తాడు.  లాస్ట్ సీన్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ లో చెర్రీ మరో పెద్ద డైలాగ్ చెప్పి  "సరైన మగాడు ఒక్కడూ లేడు.. అంతా జంక్" అంటూ ఎండ్ చేస్తాడు. 

 

ఓవరాల్ గా ఇది అందరూ ఊహించినట్టే మాస్ మాసాలా.. అందులోనూ మెగా మాస్ బోయపాటి మాసాలా. దేవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పవర్ఫుల్ గా ఉంది.  చరణ్ మాస్ డైలాగ్ లు చెప్పే సమయంలో మెగా స్టార్ గుర్తొస్తున్నాడు.


ట్రైలర్ మొత్తం సినిమా ఎలా ఉండబోతుందో చెప్పేసిన బోయపాటి, సినిమాలోని ఫ్యామిలీ సెంటిమెంట్ ని కాని రొమాంటిక్ సీన్స్ ని కాని చూపించలేదు. ఇది ముందుగానే సినిమా గురించి అందరికీ చెప్పే ప్రయత్నమా అనిపిస్తుంది. కాని చరణ్ మాత్రం కనిపించిన సీన్స్ తనలో పెరిగిన పరిణితి తో తన మాస్ విశ్వరూపం చూపించావుతున్నట్లు అర్థమవుతుంది.

Tags : Vinaya Vidheya Rama Trailer Review, Ram Charan, Kiara Advani, Boyapati

Write a comment ...
Post comment
Cancel