back

టీజర్ రివ్యూ : పవర్ఫుల్ రామ్ కొ..ణి..దె..ల



Share via:

ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు అంతా ఎదురుచూస్తున్న రామచరణ్ - బోయపాటి ల సినిమా “వినయ విదేయ రామ” టీజర్ ఈ రోజు ఉదయం రిలీజ్ చేసారు. 49 సెకన్ల ఈ టీజర్లో బోయపాటి పూర్తిగా హీరో ఎలివేషన్ మీదే దృష్టిపెట్టాడు, ప్రతి షాట్లోనూ మాస్ హీరోయిజమే కనిపిస్తూ ఎక్కడ కూడా కథని రెవీల్ చేయకుండా జాగ్రత్త తీసుకున్నాడు.

మొదలు పెట్టడమే బోయపాటి స్టయిల్లో ఒక ఆయుధం పట్టి రంగంలోకి దిగిపోయాడు రామ్ చరణ్. టీజర్లో హీరో చరణ్, విలన్ వివేక్ ఒబెరాయ్, హీరో పక్కన ఆర్యన్ రాజేష్, తమిళ్ హీరో ప్రశాంత్, తప్పితే హీరోయిన్ ని కానీ మరే ఇతర ముఖ్య పాత్ర కనపడలేదు. టీజర్ లో రాంచరణ్ “రేయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా..ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల” అని చెప్పే డైలాగ్ మెగా అభిమానులకు పండగే. రంగస్థలం విజయం వాళ్ళ వచ్చిన కాన్ఫిడెన్సు రాంచరణ్ బాడీ లాంగ్వేజ్ లో బాగా కనిపిస్తుంది. అలాగే రామచరణ్ చెప్పే ఇంకో బోయపాటి స్టైల్ డైలాగ్ “అన్నాయ్ వీణ్ని చంపేయాలా భయపెట్టాలా.. భయపెట్టడానికైతే పది నిమిషాలు.. చంపేయాలంటే పావు గంట. ఏదైనా ఓకే.. సెలక్ట్ చేసుకో” అనే దాంట్లో రామచరణ్ ఇంటెన్సిటీ చూపించాడు.

మొత్తంగా చూస్తే టీజర్ రామచరణ్-బోయపాటి అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. దేవిశ్రీప్రసాద్బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాల బాగుంది. అయితే కామన్ ప్రేక్షకులకు మాత్రం ఇది రొటీన్గా అనిపించవచ్చు. కాని టీజర్ తోనే సినిమా మీద ఒక అభిప్రాయానికి రాలేము కదా...

Tags : Vinaya Vidheya Rama Teaser Review, Mega Power Star, Ram Charan, Boyapati Srinu

Write a comment ...
Post comment
Cancel