back

వినయ విధేయ రామ స్పెషల్ సాంగ్ గురించి...



Share via:

బోయపాటి - రాంచరణ్ ల కాంబినేషన్ లో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ అదే ఐటెం సాంగ్ ఉందని మనం ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పాటకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు బయటికి వచ్చింది.

ఆ పాట టైటిల్ ‘మమామియా’ అని దానికి సంబంధించిన రిహార్సల్స్ శోభి మాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని సమాచారం. ఇక స్పెషల్ సాంగ్స్ కు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ను కూడా అదే తరహాలో కంపోజ్ చేశారట.

ఎవరైనా టాప్‌ హీరోయిన్‌తో ఈ పాట చేయించాలని చూస్తున్నారు బోయపాటి. సరైనోడులో బ్లాక్‌బస్టర్‌ సాంగ్‌కి మించిన ట్యూన్‌ దేవిశ్రీప్రసాద్‌ కంపోజ్‌ చేసాడని, ఈ చిత్రంలో మాస్‌ పాటలు, చరణ్‌ డాన్సులు ప్రత్యేక ఆకర్షణ అవుతాయని చిత్ర బృందం చెబుతోంది.

సంక్రాంతికి విడుదలవుతోన్న ఏకైక మాస్‌ చిత్రం ఇదే కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags : Ram Charan, VInaya Vidheya Rama, RC12, VVR, Special Item Song, Maamaamiya

Write a comment ...
Post comment
Cancel