back

రామ్ చరణ్ కి మరో 'మూడు' కలిసోస్తుందా?



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.

ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు. వివేక్ ఒబెరోయ్, ప్రశాంత్ తో పాటు ఎంతోమంది సీనియర్ నటినటులు నటిస్తున్న ఈ చిత్రం పై బారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ చిత్ర నిడివి కూడా మూడు గంటలు ఉండనుందని తెలుస్తుంది.

చరణ్ ముందు సినిమా రంగస్థలం కూడా మూడు గంటల నిడివితో వచ్చి అద్బుత విజయాన్ని సాదించింది, మరి బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఆక్షన్ ఎంటర్టైనర్ సగటు ప్రేక్షకుడుని మూడు గంటలు కుర్చోబెడుతుందా? మరి మన మెగాస్టార్ ఈ చిత్రానికి మూడు గంటల నిడివికి అంగీకారం తెలుపుతాడో లేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Tags : Ram Charan, Vinaya Vidheya Rama, RC12

Write a comment ...
Post comment
Cancel