back

వినయ విదేయ రామ లేటెస్ట్ అప్డేట్



Share via:

ఈ నెల 9న రిలీజ్ అయిన టీజర్ 4 రోజుల్లోనే కోటిన్నర్ర వ్యూస్ తో రికార్డ్స్ నెలకొల్పడంతో ఆనందంలో ఉన్న “వినయ విదేయ రామ” సినిమా యూనిట్, ఇక సినిమాకి సంబంధించిన పెండింగ్ వర్క్ పూర్తి చేసే పని లో ఉంది. ఇప్పటికే టాకీ భాగం పూర్తి కాగ ఇక రెండు పాటలు మరియు డబ్బింగ్ వర్క్ మిగిలి ఉంది. ఈ 18వ తేది లోపల రామ్ చరణ్ - కైరా ల మధ్య వచ్చే ఒక డ్యూయెట్ ని పూర్తి చేసి తర్వాత డిసెంబర్ లో ఇంకో పాటని చిత్రించాలని బోయపాటి డిసైడ్ అయ్యారంట. మళ్ళి 19వ తేది నుంచి చరణ్ రాజమౌళి సినిమాలో చేయాల్సిన కారణంగా రెండింటికి ఇభంది లేకుండా షూటింగ్ సెట్ చేస్తున్నారని వినికిడి. ఎంతైనా రెండు సినిమాలకి నిర్మాత డి.వి.వి.దానయ్యే కాబట్టి పెద్దగా ఇబ్బంది రావట్లేదు.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ ఊర మాస్ బోయపాటి మార్క్ సినిమా 2019 సంక్రాంతికి ఎన్ని రికార్డ్స్ తిరగారాస్తుందో చూడాలి. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ నేలాఖరున రిలీజ్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్.

Tags : Vinaya Vidheya Rama Latest Updates, VVR, Ram Charan, Boyapati Srinu

Write a comment ...
Post comment
Cancel