back

కేరళలో రాంచరణ్ సినిమా అతి పెద్ద రిలీజ్.



Share via:

సంక్రాంతి పండగకి వస్తున్న ఊర మాస్ ఎంటర్టైనర్ బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విదేయ రామ’. రంగస్థలం లాంటి భారీ వ్యాజ్యం తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కనుక దీని పైన భారీ అంచానాలున్నాయి. అయితే కేరళలో కూడా అదే సమయంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో లాగానే మంచి క్రేజ్ తో భారిగా రిలీజ్ అవుతున్నది.

తాజా సమాచారం ఏంటంటే... `వినయ విధేయ రామ` కేరళ హక్కులకు భారీ పోటీ నడుమ వీవీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి కేరళకు చెందిన ప్రకాష్ ఫిలింస్ సంస్థ వినయ విధేయ రామా హక్కుల్ని చేజిక్కించుకుంది. అలాగే రంగస్థలంని మించి మలయాళ డబ్బింగ్ వెర్షన్ ని కేరళలో రిలీజ్ చేసేందుకు సదరు సంస్థ ప్లాన్ చేస్తోందట. రంగస్థలం విజయంతో ఈ సినిమాకి పెద్ద మొత్తాన్నే చెల్లిస్తున్నారట.

రామ్ చరణ్ మగధీర మలయాళ వెర్షన్ విజయం తర్వాత కేరళలోనూ చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత చరణ్ నటించిన చాలా మాస్ సినిమాలు రచ్చ, ఎవడు కూడా అక్కడ హిట్లు కొట్టాయి. ఇటీవల `రంగస్థలం` చిత్రంతో చెర్రీ క్రేజు మలయాళంలో అమాంతం పెరిగింది. అందుకే ఇప్పుడు 'వినయ విధేయ రామ' డబ్బింగ్ హక్కుల కోసం పెద్ద కాంపిటీషన్ మధ్య భారీ మొత్తానికి అమ్మేసారు. మరి ఈ సినిమా కూడా ఇక్కడే కాక అక్కడ కూడా విజయం సాధించాలని కోరుకుందాం.

Tags : Vinaya Vidheya Rama, Ram Charan, Kerala

Write a comment ...
Post comment
Cancel