back

RRR మల్టీస్టారర్..లో విలన్..!



Share via:

రాజమౌళి ఆఫిసియాల్ గా అనౌన్స్ చేసిన మల్టీ స్టారర్ మూవీ RRR రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లు నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే .అయితే హీరో అయ్యుండి విలన్ గా విశ్వరూపం చూపిస్తే అది ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ అవుతుంది. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోలు తమలోని నటులను బయట పెడుతున్న సందర్భంలో హీరోలు తెగించి సినిమాలు చేస్తున్నారు. అయితే రాజశేఖర్ విలన్ అంటూ వస్తున్న వార్తలు పుకరుగా తెలుస్తున్నయి. అయితే ఇప్పుడు ఒక వార్త కొత్త ప్రయోగానికి తెర లేపింది. ఆ వార్త ...ఏంటంటే ఈ సినిమా లో ఎన్టీఆర్ విలన్ అనే విషయం.

జై లవ కుశలో ఎన్.టి.ఆర్ చేసిన జై పాత్ర నెగటివ్ షేడ్స్ తో ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఎన్.టి.ఆర్ ఆ సాహసం చేస్తున్నాడట. రాజమౌళి మల్టీస్టారర్ లో చరణ్ తో పాటు ఎన్.టి.ఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ అలియాస్ రామారావు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. జై లవ కుశలో హీరో అతనే విలన్ అతనే, కాని ఇందులో హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . మరి ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

మరి రాజమౌళి తెగింపు, మెగా పవర్ స్టార్ హీరోయిజం, ఎన్.టి.ఆర్ డేరింగ్ విలన్ యిజం సినిమాని ఏ లెవెల్ కి తిసుకేల్తుందో వేచి చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో మొదలవనుంది. సినిమాకు సంబందించి కొన్ని వర్క్ షాప్ చేయాల్సి ఉందని తెలుస్తుంది.

రంగస్థలం 4 రోజుల కలెక్షన్లు...

Tags : Villain of Ram Charan - NTR - SS Rajamouli film, RRR Movie Updates, Ram Charan Next Film

Write a comment ...
Post comment
Cancel
rakesh
2018-04-02 02:18:39

woww... Ur site is really helpful


Reply
Post comment
Cancel