back

ఈగ వచ్చిన రోజే రానున్న విజేత



Share via:

నిర్మాత సాయి కోర్రపాటికి మంచి అభిరుచి ఉన్న నిర్మాత అనే పేరే తప్పితే, డబ్బులు వచ్చిన సినిమాలు చాల తక్కువ. ఆయన తీసిన అన్ని సినిమాలలోకి బాగా లాబపడింది అంటే అది రాజమౌళి ‘ఈగ’ తోనే. అందుకే ఆ మేజిక్ ను మళ్లీ రిపీట్ చేయాలనే కోరికతో, సెంటిమెంట్ కొద్దీ ఈగ విడుదలైన రోజునే తను మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ ని పరిచయం చేస్తూ తీసిన సినిమా విజేతను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. అలా ఈగ రిలీజ్ డేట్ ను విజేత లాక్ చేశాడన్నమాట.

విజేత టీజర్ : పర్లేధనిపించిన మెగా అల్లుడు

2012, జులై 6న విడుదలైంది ఈగ సినిమా. అదే జులై 6వ తేదీన విజేత సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. విజేత సినిమాకు సంబంధించి రీసెంట్ గా టీజర్ విడుదలైంది. త్వరలోనే ఈ సినిమా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు.

విజేత టీజర్ : 'విజేత' ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధి....

Tags : Vijetha Movie Release Date, Kalyaan Dhev, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel