back

కళ్యాణ్ దేవ్ 'విజేత' ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిధి....



Share via:

మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా కళ్యాణ్ దేవ్ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టీజర్ మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది.

ఇప్పుడు ఇదే ఊపులో విజేత చిత్రం ఆడియో ఫంక్షన్ ని 24వ తేదిన ఘనంగా జరుపుకోడానికి సిద్ధమవుతుంది. ఇక మొదటి నుండి ఈ చిత్రానికి సంబంధించి అన్ని తానై చూసుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఆడియో ని విడుదల చెయ్యనున్నారు.

వారాహి చలన చిత్రం సంస్థ పై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం సమకూర్చారు, 'బాహుబలి' సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ చాయగ్రహకుడిగా పనిచెయ్యడం విశేషం.

విజేత టీజర్ : పర్లేధనిపించిన మెగా అల్లుడు

Tags : Vijetha Audio Launch Date, Vijetha Audio Launch Chief Guest, Megastar Chiranjeevi, Kalyaan Dhev

Write a comment ...
Post comment
Cancel