back

'సైరా'లో మెయిన్ రోల్ లో విజయ్ సేతుపతి...



Share via:

రాంచరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 200కోట్ల వ్యయంతో తీస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటికీ మరిచిపోని సినిమాని ఇవ్వాలని చరణ్ పడుతున్న తాపత్రయానికి అద్బుత మెరుగులు అధ్దుతున్నాడు దర్శకుడు సురేందర్రెడ్డి. ఈ సినిమాలో అతి పెద్ద స్టార్ కాస్టింగ్ ఉండగా అందరూ ప్రత్యేక అతిధి పాత్రలే అని ఇప్పటివరకు అనుకన్నాం. అమితాబ్ బచ్చన్, సుదీప్, లాంటి పెద్ద స్టార్స్ ముఖ్యమైన అతిధి పాత్రలు చేస్తుండగా , తమిళ ఎమర్జింగ్ స్టార్ విజయ్ సేతుపతి మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నట్లు తెలుసింది. పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న విజయ్ సేతుపతి, తమిల్ సినిమాలలో ఇప్పుడు మరో కమల్ హసన్ లాగ అద్వితీయమైన చిత్రాలు అందులో అభినయంతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు సైరా సినిమాలో తనకి సినిమా మొత్తం ఉండే పాత్రా దొరికింది అంటున్నారు. నరసింహారెడ్డి కుడి భుజంగా నిలిచినా ఒక తమిళ పోరాట యోధుడి పాత్రలో విజయ సేతుపతి నటిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగైతే చిరంజీవి లాంటి అద్భుత నటుడి పక్కన మనం మరో వైవిధ్య నటుడి నటన కూడా చూసే అవకాసం వచ్చినట్లే.

Tags : Vijay Sethupathi, Syeraa Narasimha Reddy, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel