back

సైరా అప్డేట్ - అవుకు రాజుతో ఓబయ్య



Share via:

జార్జియా లో యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో బిజీ గ ఉన్న సైరా టీం, నిన్నటి రోజు అమితాభ్ పుట్టిన రోజు సందర్బంగా ఆయన లుక్ ని రిలీజ్ చేయడం అది జనాల్లో హిట్ అయిపోవడం జరిగిపోయింది. కాని ఎవరైనా లీక్ చేసారో లేక కావాలని రిలీజ్ చేసారో నిన్న సాయంత్రమ ఒక ఫోటో ఆన్లైన్లో ప్రత్యక్ష్యం అయింది. అదేంటంటే సైరా సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్న కన్నడ స్టార్ సుదీప్, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి షూటింగ్ లొకేషన్లోని ఫోటో.

పొడవాటి జుట్టు.. మెలిదిరిగిన మీసాలు.. గడ్డం.. నుదుటిన తిలకం తో ఇద్దరూ వీరుల గెటప్ లో ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఒకే తేడా ఏంటంటే.. విజయ్ సేతుపతి తలపాగా తో ఉండగా.. సుదీప్ కు మాత్రం తలపాగా లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి చిరంజీవి పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి కుడిభుజంగా తమిళుడైన ఓబయ్య పాత్రలో కనిపిస్తాడు. సుదీప్ అవుకు రాజు పాత్రలో కనిపిస్తాడు. సుదీప్ ఫస్ట్ లుక్ సెప్టెంబర్ 2 న సుదీప్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి.. సుదీప్ పాత్రలు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Tags : Vijay Sethupathi, Syeraa Narasimha Reddy, Megastar Chiranjeevi, Kichcha Sudeep

Write a comment ...
Post comment
Cancel