back

#RRR లో విలక్షణ రచయిత ..!



Share via:

ఎన్టీఆర్ - రాంచరణ్ లతో రాజమౌళి సినిమా తీస్తున్నట్లు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి ఆ సినిమా గురించి ఏదో ఒక వార్త సినీ ప్రపంచం లో నుంచి వస్తూనే ఉంది. జనాల నుంచే కాక సిని పెద్దలు కూడా ఈ సినిమా గురించి వార్తలను ఆసక్తిగా చూస్తున్నారు. సుమారు 30 సంవత్సరాల తర్వాత ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటించడం అందులోనూ రాజమౌళి దర్సకత్వం అనేది ఎ విధంగా చూసిన చాల పెద్ద కాంబినేషన్. మరి ఈ సినిమా పైన అందరికీ ఆసక్తి ఉండడం మామూలే.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. తన మాటల పదునుతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుని క్రేజీ ప్రాజెక్ట్ లకు మాటల రచయితగా పనిచేస్తున్న బుర్రా సాయిమాధవ్ ను రాజమౌళి #RRR కోసం తీసుకున్నారట. ఇప్పటికే 'సైరా'.. 'ఎన్టీఆర్' లాంటి సినిమాలతో పాటుగా ఇతర కమిట్మెంట్లు ఉన్నప్పటికీ రాజమౌళి ఆఫర్ ను స్వీకరించాడట. తన మాటలతో విలక్షణమైన రచయితగా పేరు తెచ్చుకున్న సాయి మాధవ్ కలం బలం ఈ సినిమా పైన ఉన్న అంచనాలను ఇంకా పెంచేయడంలో సందేహం లేదు.

Tags : Versatile Writer, #RRR Movie, SS Rajamouli, Ram Charan, NTR, Sai Madhav Burra

Write a comment ...
Post comment
Cancel