back

వరుణ్ తేజ్ సినిమా పేరు ఇదేనా.....?



Share via:

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఘాజి ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌), సాయిబాబా ఓ స్పేస్‌ థ్రిల్లర్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భూమ్మీద ఎక్కడినుంచి ఎక్కడికి అడుగు వేయాలన్నా మన ఇష్టమే! అదే స్పేస్‌లో అయితే... జీరో గ్రావిటీలో మన ఇష్టాయిష్టాలతో ప్రమేయం ఉండదు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించబోతున్నారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పలువురు హాలీవుడ్‌ సాంకేతిక నిపుణులు, స్టంట్‌ కొరియోగ్రాఫర్లు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి నటిస్తుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తేజ సినిమా! ఇక్కడ చుడండి...

ఇక ఈ సినిమా పేరుని సినిమా యూనిట్ ఫైనల్ చేసారని అంటున్నారు అదేంటంటే “అంతరిక్షం”... సినిమాలో ముఖ్య భాగం అంతా స్పేస్ లో జరుగుదుంది కనుక ఈ పెరైతేనే కరెక్ట్ అని అందరు భావిస్తున్నరట... కొద్ది రోజుల్లో ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు.

సంక్రాంతికి మెగా - నందమూరి వార్ ..? ఇక్కడ చుడండి...

Tags : Varun Tej Space Film Title, Sankalp Reddy, Varun Tej Interesting Title For Next

Write a comment ...
Post comment
Cancel