back

ఈ సారీ బాక్సర్ గా అలరించబోతున్న వరుణ్ తేజ్



Share via:

ఫిదా, తొలిప్రేమ లాంటి ఫీల్ గుడ్ మూవీల బ్యాక్ టు బ్యాక్ ప్రేమ కథలతో సూపర్ హిట్లు అందుకున్న మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈ సారీ బాక్సర్ గా మేరవనున్నాడు.

అవును...
తన తదుపరి చిత్రాన్ని ఒక ఆక్షన్ కథాంశంతో జోడించిన కథకు వరుణ్ ఒకే చెప్పినట్టు వినికిడి. గీత ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కిరణ్ కొర్రపాటి అనే ఒక కొత్త దర్శకుడు తెరకేక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ జనవరి 2019లో మొదలవ్వనున్నట్టు సమాచారం.

ఇప్పటికే రెండు సినిమాలను క్యూ లో పెట్టిన వరుణ్ తన తదుపరి చిత్రం కూడా ఒకే చెయ్యడం చాల మంచి విషయం.

వరుణ్ 'ఘాజి' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటించిన "అంతరిక్షం 9000 కే.ఎం.పి.హెచ్" ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కావాల్సి ఉండగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ తో కలిసి చేస్తున్న మల్టీ స్తార్రార్ చిత్రం 'F2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతుంది.

Tags : Varun Tej, Boxer, New Film

Write a comment ...
Post comment
Cancel