back

ఒంటికి బాగా పని పెడుతున్న వరుణ్ తేజ్



Share via:

రెండు ప్రేమకథా చిత్రాలు ఫిదా, తొలిప్రేమ విజయాలతో ఒక ఘాడిన పడిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన తర్వాతి సినిమాగా ఒక ప్రయోగాత్మక కథని ఎంచుకున్నాడు. ఘాజి లాంటి దేశంలోనే మొట్ట మొదటి సబ్-మెరైన్ కథతో అందరిని ఆశ్చర్యపరిచిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు వరుణ్ తో అంతరిక్ష యాత్ర బేస్ తో సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా నటిస్తున్నాడు. ఈ మెగా హీరోతో పాటు హీరోయిన్ ఆదితి రావ్ కూడా ఒళ్లు వంచి పని చేస్తోంది.

ఈ కథలో ఎక్కువగా గాలిలో తేలుతూ ఉండాలి. అందుకోసం వరుణ్ - అదితి గాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. తాళ్లతో కట్టి వ్రేలాడదీస్తున్నారట. పొద్దున స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం లంచ్ వరకు. మళ్లీ ఈవినింగ్ ఫ్యాకప్ చెప్పే సమయానికి గాని సంకల్ప్ ఇద్దరిని వదలడం లేదు. ఇలా తాళ్ల సహాయంతో వ్యోమగామిగా హావభావాలు కరెక్ట్ గా ఉండేలా చేయడం అలవాటు లేని వారికి చాలా కష్టం. మరి ఈ జోడి ఎలా చేస్తుందో చూడాలి.

వరుణ్ తేజ్ సినిమా పేరు ఇదేనా.....?

Tags : Varun Tej, Sankalp Reddy, Aditi Rao Hydari, Lavanya Tripathi, Varun Tej Astronaut Film Updates

Write a comment ...
Post comment
Cancel