back

మొదలైన వరుణ్ తేజ్ అంతరిక్ష యాత్ర ...



Share via:

సంకల్ప్ రెడ్డి - మొదటి సినిమాతోనే (ఘాజి) నేషనల్ అవార్డు సాధించి తన సత్తా ఏంటో చూపించిన దర్శకుడు. దేశం లోనే మొదటి సబ్-మరైన్ సినిమా తీసిన సంకల్ప్ రెడ్డి ఇప్పుడు మొదటి అంతరిక్ష పరిశోధనకి సంబంధించిన సినిమా మొదులుపెట్టినాడు. వరుసగా ఫిదా, తొలిప్రేమ సినిమాల హిట్స్ తో ఫుల్ ఖుషి గా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా కంచె సినిమా తీసి మొదటి సిన్మాకే నేషనల్ అవార్డు సాధించిన నిర్మాత రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా ఈరోజు మొదులైంది. నాగబాబు క్లాప్ కొట్టగా దర్శకుడు క్రిష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా పూజ కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ అయ్యింది.

వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి మూవీ లాంచ్ గ్యాలరీ

ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్స్ గా లావణ్య త్రిపాటి మరియు అదితి రావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా పపేరు ఫిక్స్ చేయలేదు.

Tags : Varun Tej, Sankalp Reddy, Aditi Rao Hydari, Lavanya Tripathi

Write a comment ...
Post comment
Cancel