back

వరుణ్ తో జత కట్టిన బాలీవుడ్ సుందరి ....



Share via:

వరుణ్ తేజ్ హీరోగా ఘాజీ ఫేం డైరెక్టర్ సంకల్ఫ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న స్పేస్ కాన్సెప్ట్ మూవీలో ఓ హీరోయిన్ గా అదితి రావు హైదరి ఎంపికైంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కోసం స్పేస్ సూట్ వేసుకుని సెట్ లోకి అడుగు పెట్టేసింది. ఈ సందర్భంగా హీరో వరుణ్ తో కలిసి ఆస్ట్రోనాట్ గెటప్ లో ఓ సెల్ఫీ తీసుకుని దీనిని సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ‘‘చందమామను వెంటాడదం.. చుక్కలతో డ్యాన్స్ చేద్దాం.. చంద్రుడిపై మట్టి తీసి తోటి ప్రయాణికులపై చల్లుదాం’’ అంటూ ఫన్నీగా కామెంట్ యాడ్ చేసింది.

హైదరాబాది అమ్మాయే అయిన అదితి హిందీ లో బాగా పాపులర్ అయింది. కార్తి హీరోగా మణిరత్నం డైరెక్ట్ చేసిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది. ఇప్పుడు అంతరిక్ష యాత్ర నేపథ్యంలో తెలుగు లో వస్తున్న మొదటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమ్మడు మరి తెలుగు ప్రక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

Tags : Varun Tej Space Thriller Film Heroine, Sankalp Reddy, Varun Tej Astronaut movie heroine

Write a comment ...
Post comment
Cancel