back

మరో ప్రయోగానికి సిద్ధమైన వరుణ్ తేజ్..



Share via:

మెగా హీరోలు ఎంత మంది ఉన్న కూడా తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకుంటున్న హీరో వరుణ్ తేజ్. తొలి రెండు సినిమాలు నిరుత్సాహ పరిచినా కూడా ‘కంచె’ లాంటి వైవిధ్యభరితమైన సినిమా చేసిన వరుణ్ తరువాత ‘ఫిదా’ మరియు ‘తొలిప్రేమ’ ల తో విజయాలను రుచి చూసాడు. తన ప్రత్యేకతని చాటుకుంటూ అంతరిక్ష యాత్రకి సంబంధించిన కథలో నటిస్తున్న వరుణ్ మరో వైపు విక్టరీ వెంకటేష్ తో కలిసి F2 అనే మల్టిస్తారెర్ కూడా నటిస్తున్నాడు.

తాజాగా వరుణ్ తేజ్ ఒక పీరియడ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సాగర్ చంద్ర నిజామ్ నవాబుల కాలం నేపథ్యంలో సాగే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వరుణ్ తేజ్ ను మెప్పించాడట.   అంతే కాదు ఇది మనసుకు హత్తుకొనే ఒక ప్రేమ కథ అని సమాచారం.  సాగర్ చంద్ర తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 90'ల కాలాన్ని సినిమాలో చూపించిన విధానానికి ప్రేక్షకులు కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా నిజాం కాలాన్ని ఎంచుకోవడం విశేషమే.   దీంతో డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుంటాడనే పేరును వరుణ్ తేజ్ మరోసారి నిలబెట్టుకున్నట్టే.  త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రానుంది.

Tags : Varun Tej

Write a comment ...
Post comment
Cancel