back

ఈ నెలతో పూర్తి కానున్న అంతరిక్షం షూటింగ్ ...



Share via:

‘ఘాజీ’ ఫెమ్ సంకల్ప్ రెడ్డి స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నచిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకుందని తెలుస్తోంది. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్, అదితి రావు, లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట.

ఈ సెప్టెంబర్ నెలాకరి లోపల షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలనీ భావిస్తోంది సిని యూనిట్. ఈ సినిమాని డిసెంబర్ 21 న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు.

Tags : Varun Tej, Anthariksham

Write a comment ...
Post comment
Cancel