back

మెగా - నందమూరి వార్ | మధ్యలో వరుణ్ తేజ్!!



Share via:

వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీనే కదా... మళ్లి మధ్యలో అంటారేంటి అని అనుకుంటున్నారా? అదే మరి ఇక్కడ విచిత్రం!

ఇప్పటికే రాంచరణ్ నటిస్తున్న బోయపాటి సినిమా, నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్. టి. ఆర్ సినిమాలు వచ్చే సంక్రాంతికి పోటి పడబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులో వరుణ్ తేజ్ కూడా వచ్చి చేరాడు. అదేలాగంటారా...?

వరుణ్ తేజ్ - వెంకటేష్ నటిస్తున్న మల్టిస్తార్రార్ చిత్రం "ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్" ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు.... ఎలాగైనా ఎఫ్ 2ని సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట.

ఇంతకముందు 'ఖైది నం. 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి ' లాంటి భారీ సినిమాల మధ్యలో తను విడుదల చేసిన శతమానంభవతి చిత్రం అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు మరోసారి, ఎఫ్2 తో ఈ ఫీట్ ని సాదించాలని చూస్తున్నారు దిల్ రాజు.

అందుకే... ఇప్పుడు మెగా - నందమూరి వార్ మధ్యలో వరుణ్ వచ్చి చేరాడు. మరి సంక్రాంతి బరిలో వరుణ్ తేజ్ ఏ మేర ఆకట్టుకుoటాడో వేచి చూడాల్సిందే...

Tags : Varun Tej, Mega Power Star Ram Charan, Nandamuri Balakrishna, F2 Fun and Frustration

Write a comment ...
Post comment
Cancel