back

వరుణ్ తేజ్ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరంటే ?



Share via:

వరుసగా సినిమాలు తీస్తూ పోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తొందరలో హరీష్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ కి ఈ సినిమా రీమేక్. 14 రీల్స్ బ్యానర్ పైన ఈ సినిమా నిర్మించబడుతుంది.

ఈ చిత్రంలో వరుణ్ కు జోడిగా ‘ఛలో’ మరియు ‘గీత గోవిందం’ సినిమాలతో అందరి మన్ననలు పొందిన కన్నడ బ్యూటీ రష్మిక నటించనున్నారని సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో లక్ష్మి మీనన్ పోషించిన పాత్రను తెలుగులో రష్మిక చేయనుందట.

rashmika mandanna

ఇక వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’ ఈ నెల 21న రిలీజ్ అవ్వనుంది. అలాగే వెంకటేష్ తో కలిసి చేస్తున్న ‘F2’ సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతుంది. వీటి విడుదల తర్వాత కొత్త సినిమా షూటింగ్ ఉండచ్చు.

Tags : Varun Tej, Rashmika Mandanna, Harish Shankar, Jigarthanda

Write a comment ...
Post comment
Cancel