back

శ్రీకాకుళంకి నేను సాయం చేశా మరి మీరు - వరుణ్ తేజ్



Share via:

తిత్లీ’ బీభత్సం కారణంగా సిక్కోలు పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా శ్రీకాకుళానికి తమ విరాళం ప్రకటిస్తున్నారు. అయితే ఈ మహాకార్యానికి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అందరికంటే ముందుగా రూ. 50 వేలు విరాళం ప్రకటించి సినీ ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచాడు. ఆదివారం విజయ్ దేవరకొండ తన వంతుగా రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీంతో సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా తమ విరాళాన్ని ప్రకటిస్తున్నారు.

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.15 లక్షలు విరాళంగా ప్రకటిస్తే.. కల్యాణ్ రామ్ రూ.5 లక్షలు ప్రకటించాడు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వంతు సాయం తను చేశానని.. ఇక మీవంతంటూ ట్వీట్ చేశాడు. ‘‘మన ప్రజల కోసం మనం నిలబడాల్సిన సమయమిది. నా వంతు సాయం నేను చేశాను. నేను ప్రతి ఒక్కరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.. ఆంధ్రాలోని ఇళ్లను పునర్న్మించుకోవడానికి కావల్సిన ఆర్థిక సాయం చేయండి’’ అంటూ వరుణ్ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే తాను విరళంగా ఎంత ప్రకటించింది మాత్రం వరుణ్ వెల్లడించలేదు.

Tags : Varun Tej, Titli Floods

Write a comment ...
Post comment
Cancel