back

వెంకటేష్ కి వరుణ్ తేజ్ పోటీ ఇవ్వగలడా.?



Share via:

33 సంవత్సరాల అనుభవం లో ఎన్నో రకాల సినిమాలు చేసిన విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కొంచం స్లో అయ్యాడు. సెలెక్టివ్ సినిమాలు చేస్తున్న తను, చాలా గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా “F2”. ట్రైలర్ చూస్తుంటే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా అనిపిస్తున్న ఈ సినిమాలో వెంకి పక్కన వరుణ్ ఆ లెవెల్లో నటించగలడా అనేది పెద్ద ప్రశ్న ..?


అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ అయిన ఎఫ్2లో కామెడీ టైమింగ్ తో కంటెంట్ మొత్తాన్ని తన కంట్రోల్ లో తీసుకునే వెంకటేష్ ఉండగా పది సినిమాల అనుభవం కూడా లేని వరుణ్ తేజ్ నిలవడం అంత ఈజీ కాదు. వరుణ్ తేజకి కామెడీతో అంతగా టచ్ లేకపోవడంతో వెంకటేష్ తో పోటీ పడి నటించడం కష్టం అయింది అంటున్నారు సినిమా యూనిట్.

జూక్ బాక్స్: ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ | వరుణ్ తేజ్, వెంకటేష్

సెకండ్ హాఫ్లో ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా కూడా అధికంగా వుంటుందని, ఆ సీన్లు కూడా వెంకటేష్కి కొట్టిన పిండి కావడంతో వరుణ్ తేజ్ సినిమాలో తన ఉనికిని చాటుకోవడం సవాలే. ఒకవేళ ఎఫ్2 హిట్టు కొట్టినా దాని క్రెడిట్ లో అధిక శాతం వెంకటేష్ ఆ తర్వాత అనిల్ రావిపూడి లాగేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వరుణ్ ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల కంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తేనే ఈ సినిమా క్రెడిట్ తనకి కూడా దక్కుతుంది. చూద్దాం మరి జనవరి 12న తేలిపోతుంది.

Tags : Venkatesh, VarunTej, F2

Write a comment ...
Post comment
Cancel