గత కొంతకాలంగా సోషల్ మారుమ్రోగుతున్న పేరు ‘రే లిడా’, జపాన్‌లో జరిగిన ఒక రన్నింగ్ మారథాన్ రిలే రేస్ లో ఫ్రాక్చర్ అయిన కాలితో పాకుతూ రేస్ ని పూర్తి చేసిన 19 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తి అవుతున్నది. అసలేమి జరిగిందంటే
“తన టీంమేట్ నుంచి ఫ్లాగ్‌ని అందుకున్న లిడా.. వెంటనే పరుగు ప్రారంభించింది. అయితే కొంత సమయానికి ఆమె కుడి కాలు విరిగి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ.. పరుగు ఆపలేదు. తన మోకాళ్లపై దాదాపు 200 మీటర్లు పాకింది. తన కోచ్.. స్నేహితులు ఎంత చెప్పినా తన పయనం ఆపలేదు. మోకాళ్ల నుంచి రక్తం కారుతున్న వెనకడుగు వేయలేదు. ఈ దృశ్యాన్ని చూస్తూ.. అవతలి పక్కన ఉన్న తన భాగస్వామికి కన్నీళ్లు ఆగలేదు. చివరికి లిడా తన భాగస్వామి వద్దకు చేరుకొని జెండాను అందించి.. ఆ పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పైకి వెళ్లి కూర్చుంది. ఆ తర్వాతి దృశ్యాన్ని చూసిన అక్కడి వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అక్కడ కూర్చున్న లిడా మోకాళ్ల నుంచి రక్తం జలపాతంలా కారుతుంది. అయినా ఆమె దాన్ని లెక్క చేయకుండా రేసు పూర్తి చేయడం అందరిని బాధతో కూడిన ఆశ్చర్యానికి గురి చేసింది. బాధతో కొంత సమయం విలవిలలాడిన లిడాను వైద్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. ఆమె కోలుకోవడానికి కనీసం నాలుగు నెలలైనా పడుతుందని వైద్యులు చెప్పారు. అయితే ఈ మారథాన్‌ని లిడా జట్టు మూడో స్థానంలో పూర్తి చేయడం విశేషం. అయినప్పటికీ.. తన జట్టు తన వల్లే మూడో స్థానంలో రేసు పూర్తి చేసిందని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు లిడా చెప్పింది”. తాజాగా వరుణ్ తేజ్ కూడా ట్విటర్లో ఆమె వీడియోను పోస్ట్ చేసి ‘ఇది అసలు సిసలైన అంకితభావం అంటే’ అని ట్వీట్ చేశారు.
A Japanese runner who broke her leg during a relay race. She crawled to her partner so the team would be able to continue the race. Lets share her story with the world. pic.twitter.com/NNiSL9Q64F
— Kevin W (@kwilli1046) November 11, 2018
Tags : Varun Tej, Japanese Runner Rei Lida