back

20 రోజుల గ్యాప్ లో రెండు సినిమాలతో వస్తున్న వరుణ్ తేజ్ !



Share via:

వరుస విజయాలతో మంచి ఫార్మ్ లో ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తరవాతి రెండు సినిమాలను కేవలం 20 రోజుల గ్యాప్ లో థియేటర్లోకి తెస్తున్నాడు.

డిసెంబర్ 21న సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'అంతరిక్షం' విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ అక్కడి నుంచి కేవలం 20 రోజుల వ్యవధిలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్ తో కలిసి నటించిన 'ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్' చిత్రం సంక్రాంతికి వస్తుంది.

మరి రెండు సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో రిలీజ్ అయితే వ్యాపార పరంగా ఇబ్బంది ఉండోచ్చు కాబట్టి F2 రిలీజ్ వాయిదాపడే సూచనలు ఉన్నాయి అంటున్న సిని వర్ఘాలు.

మరి ఎంతవరకు దిల్ రాజు ప్రకటించిన డేట్ నుంచి వెనక్కి తగ్గుతాడు అనేది చూడాలి. అయిన రామ్ చరణ్ మాస్ సినిమాకి మరియు ఎన్టిఆర్ బయోపిక్ కి పోటిగా రిలీజ్ చేయడంకంటే కుడా తరువాత రిలీజ్ చేసుకోవడమే మేలు.

Tags : Varun Tej, Movies, Antariksham, F2 Fun & Frustration

Write a comment ...
Post comment
Cancel