back

వకీల్ సాబ్ టీజర్ ఇక అప్పుడే ?



Share via:

పవన్ కళ్యాణ్ 2018 జనవరిలో అజ్ఞాతవాసి చిత్రం విడుదల తర్వాత పాలిటిక్స్ లో అడుగు పెట్టినప్పటినుంచి ఆయన ఏ సినిమాలు ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి రెండేళ్లు దాటిపోయింది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఆయన సినిమాలో ఎపుడెపుడు కనిపిస్తాడా అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా వైరస్ లేకపోతే మే నెలలోనే వారి కోరిక తీరేది. ఆయన కమ్ బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' షూటింగ్ లాక్ డౌన్ కారణంగా 4 నెలలుగా వాయిదాపడుతూ ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో షూటింగ్స్ ఎవరూ జరపడం లేదు.

తీవ్ర నిరాశలో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి కొంచెం ఉపశమనం కలిగించడానికి వకీల్ సాబ్ చిత్ర యూనిట్ వారికి ఓ భారీ సర్ఫ్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. పవన్ బర్త్ డే తేదీ సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ టీజర్ రానుందట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Tags : Pawan Kalyan, Vakeel Saab

Write a comment ...
Post comment
Cancel