back

వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?



Share via:

మెగా ఫామిలీ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్‌ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2న విడుదల చేయాలనుకున్నారు కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని మే ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారట. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

Tags : Vaishnav Tej, Sai dharam tej, Uppena

Write a comment ...
Post comment
Cancel