back

అల్ ది బెస్ట్ Mr.C - ఉపాసన



Share via:

ఉపాసన విషెస్ ఎందుకు చెప్పిందో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదేనండీ.. ఇటీవలే ఘనంగా పూజా కార్యక్రమాలు చేసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా షూటింగ్ మొదటిరోజు ఈ రోజు. జక్కన్న, రామ్ చరణ్, ఎన్టీఆర్ ముగ్గురూ కలిసి బిగ్గెస్ట్ సునామీ సృష్టించడానికి సెట్స్ పైకి వెళుతున్న రోజు. ఎంతో కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్న రోజు.

తాజాగా కొద్దిసేపటి క్రితమే చెర్రీకి ఆల్ ది బెస్ట్ అని తెలుపుతూ ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పైగా ఈ పోస్ట్‌కి చెర్రీ మాలధారణలో ఉన్న ఫొటో జత చేయటం ప్రేక్షకులకు కన్నుల పండుగ అయింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర విశేషాలు, చెర్రీకి సంబంధించిన తాజా అప్‌డేట్స్ నెటిజన్ల ముందుచుతుంది ఉపాసన.

Tags : Upasana, Ram Charan, RRR Movie, Rajamouli, NTR

Write a comment ...
Post comment
Cancel