back

స్కూల్ పిల్లల కోసం ముందుకొచ్చిన ఉపాసన కొణిదెలShare via:

అపోలో ఫౌండేషన్ ఎమ్ డి అయిన రాంచరణ్ భార్య ఉపాసన, తమ దోమకొండ సంస్థానం పరిధిలోని 3 ప్రభుత్వ స్కూల్స్ లో పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడానికి ముందుకు వచ్చారు. తెలంగాణ - దోమకొండ కోట ఏరియాలో గ్రామాల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ట్రస్ట్ తో కలిసి అపోలో ఫౌండేషన్ ఎమ్ డి ఉపాసన పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ మూడు ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అందజేస్తామని - వాటిని లంచ్ కి - డిన్నర్ కి మధ్య అందించేలా ఏర్పాట్లు చేస్తామని ఉపాసన ప్రకటించారు. అలాగే ఈ సందర్భంగా అక్కడ ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి మరి వాళ్ళని కలిసి వచ్చారు ఉపాసన.


ఇప్పటికే ఎన్నో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాసన కొణిదెల, ఇప్పుడు వేసిన ఈ అడుగు స్ఫూర్తితో ఇతర స్టార్లు - సెలబ్రిటీలు ఇలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలి. స్టార్లు - ఇతర రంగాల సెలబ్రిటీలు ఈ దిశగా ఆలోచిస్తే.. భావి భారత పౌరుల భవిష్యత్ కి కొంతవరకూ భరోసా ఉంటుందనడంలో సందేహం లేదు.

Tags : Upasana, Ram charan

Write a comment ...
Post comment
Cancel