back

ఉపాసన కొణిదెలకు ప్రతిష్ఠాత్మక మహాత్మా గాంధీ అవార్డు!..



Share via:

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భార్యగానే కాకుండా, బీ పాజిటివ్ మ్యాగజీన్ ఎడిటర్‌గా, యువ వ్యాపారవేత్తగా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లో భాగమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఉపాసన తాజాగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నాయకత్వ విభాగంలో మహాత్మా గాంధీ అవార్డు సొంతం చేసుకున్నారు. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఉపాసన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఇతరులకు సేవ చేయడం ద్వారా నిన్ను నువ్వు కోల్పోవడమే.. నిన్ను నువ్వు కనుగొనే ఉత్తమ మార్గం. మహాత్మా గాంధీ అవార్డు అందించినందుకు ధన్యవాదాలు. ఈ గాంధీ జయంతి మా కుటుంబానికి చాలా ప్రోత్సాహకరంగా నిలిచింది. సైరా నరసింహారెడ్డి మీద మీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ ఉపాసన ట్వీట్‌ చేశారు.

Tags : Syeraa, Chiranjeevi, Ramcharan, Upasana

Write a comment ...
Post comment
Cancel