back

టాప్ 5 లో రెండు మెగా సినిమాలే ..



Share via:

బాహుబలితో తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియడమే కాక మొదటి సారి 100కోట్ల షేర్స్ తో చరిత్ర తిరగరాయబడింది. ఆ తర్వాత మెగాస్టార్ 10 సంవత్సరాల గాప్ తర్వాత కూడా తను మెగాస్టార్ ఎందుకు అయ్యాడో నిరూపిస్తూ ఒక మాములు కమర్షియల్ సినిమాతో 100కోట్లు రాబట్టాడు. తర్వాత మళ్ళి బాహుబలి 2 ఈ ఫీట్ ని సాధించగా, ఈ ఇయర్ లో కేవలం 20 రోజుల వ్యవధిలో రెండు సినిమాలు 100 కోట్లని కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యపరిచింది. రంగస్థలం మరియు భరత్ అనే నేను సినిమాలో విషయం ఉంటె తెలుగు సినిమా మార్కెట్ ఎంత పెద్దది అనేది మరో సారి రుజువు చేసాయి. ప్రస్తుతం తెలుగు టాప్ 5 సినిమాలు వసూళ్ళ పరంగా చూస్తే... రెండు బాహుబలి కాగ 2 మెగా హీరోల సినిమాలే ఉన్నాయి. ఒక సారి ఆ లిస్టు చూద్దం.....

1.బాహుబలి 2- 309 కోట్లు (తెలుగు వెర్షన్ తో)

2. బాహుబలి - 189 కోట్లు (తెలుగు వెర్షన్ తో)

3. రంగస్థలం - 127 కోట్లు

4. భరత్ అనే నేను - 103 కోట్ల 50 లక్షలు

5. ఖైదీ నెంబర్ 150 - 102 కోట్లు

ఇక రిలీజ్ అయ్యే సినిమాలలో చిరంజీవి సైరా మరియు ప్రభాస్ సాహో సినిమాలు సుమారు 200కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్నాయి. ఇవి అనులున్నట్లు ఆడితే పైన లిస్టు మొత్తం మారిపోవచ్చు.

Tags : Chiranjeevi Khaidi No. 150, Ramcharan Rangasthalam

Write a comment ...
Post comment
Cancel
Subbareddy
2018-05-24 20:38:18

BAN till not yet cross 100cr 95cr closing


Reply
Post comment
Cancel