back

రాంచరణ్ ని వాడేసుకుంటున్న టీఆర్ఎస్



Share via:

రాంచరణ్ ని వాడుకోవడమంటే టిఆర్ఎస్ కి అతను ఏమైనా ప్రచారం చేస్తారా అని అనుకునేరు, ఇది ఇండైరెక్ట్ గా వాడుకోవడం. రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో తన అన్నని ఎన్నికల్లో గెలిపించడానికి రాంచరణ్ పాడే “ఆ గట్టునుంటారా “ పాత చాలా పెద్ద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆహ్ పాటనే కొంచం మార్చి వాడేస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీకి చెందిన సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్.. పార్టీ అవసరాలకు అనుగుణంగా ‘ఆ గట్టునుంటావా’ పాట సాహిత్యాన్ని టీఆర్ ఎస్ పార్టీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి.. బంగారు తెలంగాణ కోసం టీఆర్ ఎస్ వైపు నిలబడాలంటూ పాటను తయారు చేశారు. ఇప్పుడా పాటను జనసామన్యంలోకి తీసుకొచ్చి పాపులర్ చేస్తున్నారు. ‘ఈ గట్టున బంగారు తెలంగాణ ఉంటుంది.. ఆ గట్టున కుక్కలు చంపిన విస్తరి ఉంటది’ అని అర్థం వచ్చేలా రచన మార్చారు. ఈ పాటలో తెలంగాణ పోరాట భాగస్వాములను కూడా మిళితం చేసి తీర్చిదిద్దారు.

మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఈ పాట డైలాగ్ ‘ఆ గట్టునుంటారా.. ఈ గట్టుకొస్తారో’ ప్రజలు నిర్ణయించుకోవాలని ప్రజలను కోరారు. గ్రామాలు - పట్టణాల్లో కూడా ఇదే పాటను టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారంలో వాడుకుంటూ ప్రజల్లో ఆసక్తి రేపుతున్నారు.

Tags : TRS Party, Mega Power Star, Ram Charan

Write a comment ...
Post comment
Cancel