back

పవన్ తో కోబలి తీస్తా - త్రివిక్రమ్



Share via:

పవన్ కళ్యాణ్ తో 'జల్సా', 'అత్తారింటికి దారేది' లాంటి ఘన విజయాలతో పాటు అఘ్నాతవాసి లాంటి మరిచిపోధగ్గా సినిమా తీసిన త్రివిక్రమ్, ఇప్పుడు పవన్ తో ఇంకో సినిమా తీసే ఉద్దేశ్యం ఉన్నట్లు బయటపెట్టారు. ఎన్నికల తర్వాత పవన్ ఒకవేళ సినిమా తీయాలి అనుకుంటే ఐదేళ్ళ నుంచి అనుకుంటున్న కోబలి సినిమా తీస్తాం అని చెప్పుకొచ్చారు.

కోబలి కథ గురించి చెబుతూ, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా మొదలైంది.. ఎలా రూపాంతరం చెందింది అనే విషయాలపై తాను పరిశోధన చేశానని.. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయని.. శత్రువులపై కత్తులతో దాడి చేస్తున్నపుడు ఫ్యాక్షనిస్టులు ఊపుకోసం ‘కోరు బలి.. నరుకు బలి’ అని గట్టిగా అరుస్తారని.. అదే వాడకంలో ‘కోబలి’గా మారిందని త్రివిక్రమ్ చెప్పాడు. ఒకప్పటి పత్రికల్ని కూడా తిరగేసి ఒక ఫైల్ తయారు చేశానని.. ‘కోబలి’ స్క్రిప్టు కూడా రెడీ అయిందని.. పాటలు లేకుండా గంటా 45 నిమిషాల నిడివితో సినిమా చేయాలనుకున్నానని.. పవన్ కూడా ఓకే చెప్పాడని... సమయం కోసం వేచి చూస్తున్నాం అని పేర్కొన్నారు.

అఘ్నాతవాసి సినిమాకి పంపినిదారులకి వచ్చిన 30 కోట్ల నష్టంలో తను, పవన్ కళ్యాణ్ మరియు నిర్మాత కలిసి 25 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు.

Tags : Pawan Kalyan, Trivikram Srinivas, Kobali

Write a comment ...
Post comment
Cancel