back

కోబలి నే అరవింద గా మార్చేసారా..?



Share via:

త్రివిక్రమ్ ఎంతో కాలంగా రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ తో చేయాలనీ అనుకున్న కథ “కోబలి”. అది ఒక దృశ్య రూపం దాల్చక ముందే పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఇక ఈ ప్రాజెక్ట్ అటకేక్కేసినట్లే అనుకున్నారు అంతా.. కాని సిని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ వేరేలా ఉంది.. కోబలి కథనే కొంచం మార్చి ఇప్పుడు తారక్ తో అరవింద తీసారు అంటున్నారు.

అరవింద సమేత వీరరాఘవ సినిమా సెన్సారు నిన్న పూర్తయింది. సెన్సారు అనంతరం సినిమా సంగతులు, కథ బయటకు రావడం అన్నది కామన్. అలా వచ్చిన కథ వింటూవుంటే, కోబలి సినిమానే అరవిందగా మారిందా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీ లో... మరి అది ఎంత వరకు నిజం అనేది త్రివిక్రమ్ - పవన్ లకే తెలియాలి.

Tags : Trivikram Srinivas, Kobali, Aravindha Sametha, Pawan Kalyan, NTR

Write a comment ...
Post comment
Cancel