back

పాటలో వినయ విధేయ రామ కథ చెప్పిన బోయపాటి...



Share via:

పక్కా మాస్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ మిలితమయిన సినిమాలు తీసి వాటిని విజయవంతం చేయడంలో బోయపాటి శ్రీనివాస్ మేటి దర్శకుడు.

ఎక్కువ విజయాలు కలిగిన దర్శకుడిగా అందులోనూ మాస్ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా తను తీస్తున్న కొత్త సినిమా ‘వినియ విధేయ రామ’ కూడా ఫుల్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ మాస్ చుట్టూ తిరిగే లాగానే కనిపిస్తుంది. నిన్న రిలీజ్ అయిన పాటతో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

“పెద్ద కుటుంబం, ఆనందంగా కాలం గడిచిపోతుంటే అనుకోకుండా ఒక అవరోధం, దాని నుంచి ఆ కుటుంబంని హీరో ఎలా రక్షిస్తాడు” అనేది మెయిన్ స్టొరీగా అర్థం అవుతుంది.

ఈ పాట ఎలా ఉంది అని ఒక్క ముక్కలో చెప్తే సింపుల్ అండ్ బ్యూటిఫుల్.

మొదటి సారి వింటే.. పాత దేవీ హిట్ సాంగ్స్ స్టైల్ లో అనిపిస్తుంది కానీ.. ఓ నాలుగైదు  సార్లు వింటే మీరు పాట మాయలో పడడం.. తందానె తందానె అని హమ్ చేయడం ఖాయమే.

ఈ పాట సింప్లిసిటీ కి తోడు విజువల్స్ కూడా గుడిలో ట్రెడిషనల్ డ్రెస్సుల్లో స్వామివారి పల్లకీని చరణ్ మోయడం చూస్తుంటే ఓ మంచి ఫీల్ వస్తోంది.  ఏదేమైనా ఫస్ట్ పాటతోనే అందరినీ దేవీ ఫ్లాట్ చేసినట్టే.

Tags : Thandaan Thandaane Song Review, Ram Charan, DSP, Kiara Advani

Write a comment ...
Post comment
Cancel