back

వినయ విధేయ రామ నుండి మొదటి పాట ఎప్పుడో తెలుసా?



Share via:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో నుండి మొదటి పాటకు ముహూర్తం కుదిరింది.

సాంగ్: తందానే తందానే ఫుల్ సాంగ్ | వినయ విధేయ రామ

దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందించిన ఈ చిత్రంలోని తోలి పాట 'తందానే తందానే' ని ఈ నెల 3వ తేదీన సా.4 గం.కు చిత్ర యూనిట్ విడుదల చేయ్యనున్నట్టు వెల్లడించింది.

ఈ పాట రామ్ చరణ్ కుటుంబంలో వచ్చే పాట అని... ఈ పాట తాను ముందే విన్నాను, చాల బాగుంది అని ఉపాసన తెలిపింది.

vinaya vidheya rama first single song thandaane thandaane release date

రామ్ చరణ్ గత చిత్రం 'రంగస్థలం' చిత్రానికి అద్బుత బాణీలు సమకూర్చిన దేవి, మరి ఈ ఫ్యామిలి ఆక్షన్ డ్రామా అయిన వినయ విధేయ రామకి ఎలాంటి సంగీతం అందించాడో వేచి చూడాలి.

వినయ విధేయ రామలో రామ్ చరణ్ సరసన కైరా అద్వాని నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ మరియు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక ప్రత్యెక గీతంలో కాథరిన్ థెరిస్సా మేరవనున్నట్టు సమాచారం.

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వనున్న ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకేక్కిస్తుండగా, డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నాడు.

సాంగ్: తందానే తందానే ఫుల్ సాంగ్ | వినయ విధేయ రామ

Tags : Vinaya Vidheya Rama First Single Song, Ram Charan, VVR Songs

Write a comment ...
Post comment
Cancel