back

మళ్ళి లాభాల బాట పడ్తున్న 'తేజ్' సినిమా...



Share via:

వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయిన మెగా హీరో... సుప్రీమ్ స్టార్ సాయి ధరం తేజ్ మళ్ళి గాడిలో పడడానికి ప్రయత్నిస్తున్నాడు. తన తదుపరి చిత్రం 'తేజ్ ఐ లవ్ యు' జూలై 6వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

వరుస ఫ్లాప్లతో తన మార్కెట్ ని దాదాపుగా కోల్పోయిన సాయి ధరం... తేజ్ ఐ లవ్ యు చిత్రంతో మాత్రం తన మార్కెట్ ని పెంచుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం 15 కోట్ల బడ్జెట్ తో కరుణాకరన్ దర్శకత్వంలో కే.ఎస్ రామారావు గారు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 15 కొట్లలో 7 కోట్లు తెలుగు, హిందీ థియేటరికల్ రైట్స్ ద్వారానే వచ్చాయంట. ఇక ఈ సినిమాతో తేజ్ కూడా తన మార్కెట్ ని మళ్ళి నిర్మించుకోడానికి ట్రై చేస్తున్నాడు.

అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పై ఇటు ప్రేక్షకుల్లో... అటు ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి అంచానాలున్నాయి.

Tags : Sai Dharam Tej, Tej I Love You Pre Release Business, Anupama Parameswaran, KS Rama Rao

Write a comment ...
Post comment
Cancel