back

సెన్సార్ పూర్తి చేసుకున్న తేజ్ ఐ లవ్ యు



Share via:

సాయి ధరం తేజ్ నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తేజ్ ఐ లవ్ యు ఈ నెల 6వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకి సంబందించిన ముఖ్య ఘట్టం 'సెన్సార్'ని పూర్తి చేస్కుని క్లీన్ 'U' సర్టిఫికేట్తో విడుదలకి సిద్ధమైంది.

కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తేజ్ కి జంటగా నటించింది. గోపి సుందర్ సంగీతం అందించగా, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్ రామారావు నిర్మించారు.

ఇప్పటికే వరుస ఫ్లాప్లతో ఉన్న సాయి ధరం తేజ్... ఈ లవ్ స్టోరీలో ఎంత వరకి ఆకట్టుకుంటాడో చూడాలి.

Tags : Tej I Love U Sensor, Tej I Love You Movie Release, Sai Dharam Tej

Write a comment ...
Post comment
Cancel