back

తేజ్ ఐ లవ్ యు గ్రాండ్ ఆడియో సక్సెస్ మీట్



Share via:

సాయి ధరం తేజ్ నటించిన 'తేజ్ ఐ లవ్ యు' ఆడియో ఈ మధ్యనే విడుదలైన విషయం తెలిసిందే. అందులోని పాటలు అద్బుత ప్రేక్షకాదరణ పొంది సూపర్ హిట్ ఆల్బం గా నిలిచింది. ఇప్పుడు చిత్ర బృందం ఈ విజయాన్ని మెగా అభిమానులతో పంచుకోడానికి రెడీ అయ్యింది.

తేజ్ ఐ లవ్ యు ఆడియో సక్సెస్ మీట్ ని ఈ నెల 17న వైజాగ్ లోని గురజాడ కళాక్షేత్రంలో జరుపుకోనుంది.

తేజ్ ఐ లవ్ యు చిత్రంలో తేజ్ పక్కన అనుపమ పరమేశ్వరన్ జోడిగి నటిస్తుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ అద్బుతమైన సంగీతం అందించగా, కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కే.ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం వచ్చే నెల 6వ తేదిన విడుదల అవుతుంది.

Tags : Tej I Love U Audio Success Meet, Sai Dharam Tej

Write a comment ...
Post comment
Cancel