back

సాయి కోసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరోస్తున్నారు ?



Share via:

వరుసగా మూడు హిట్లు తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులతో డీలా పడి పోయిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి రిలీజ్ కాబోతున్న “తేజ్ ఐ లవ్ యు” సినిమా విజయం చాల ముఖ్యం. అందుకే ఈ సినిమాకి వీలైనంత ఎక్కువ పబ్లిసిటీ చేయాలని డిసైడ్ అయిపోయాడు. అందులో భాగంగా ఈ నెల 9 న జరగనున్న ఆడియో ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించాలని నిర్మాతకు చెప్పెసాడు సాయి. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిధిని తీసుకొచ్చే భాద్యత మాత్రం సాయిదే..!

మరి ఇప్పుడు సాయి కోసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొస్తారు అంటే అందరి కంటే మెగాస్టార్ చిరంజీవి పేరే అందరికీ గుర్తొస్తుంది. చిరంజీవి అయితేనే సినిమా గురించి అభిమానుల్లోకి సరైన విధంగా చేర్చగలరు కాబట్టి సాయి మొదటి ఛాయస్ చిరంజీవే...

సాయి ధరం తేజ్ లైవ్ చాట్

హైదరాబాద్ లోనే సైరా షూటింగ్ లో ఉన్న చిరంజీవి కుడా మేనల్లుడు అడిగితే కాదనకపోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ జన పోరాట యాత్ర లో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేడు. పారిస్ ట్రిప్ లో ఉన్న రాంచరణ్, లండన్ ట్రిప్ లో ఉన్న అల్లు అర్జున్ కూడా సాయి పిలిస్తే రావచ్చు. ఎందుకంటే అప్పటివరకి వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉంటారు కనుక.


చూద్దాం మరి ఎవరు వస్తారో.

ఫొటోస్: తేజ్ I Love U పోస్టర్స్ HD

Tags : Tej I Love U Audio Launch Date & Chief Guest, Sai Dharam Tej, Megastar Chiranjeevi, Pawan Kalyan, Ram Charan, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel