back

మేనల్లుడు కోసం రంగంలోకి మెగాస్టార్ ..



Share via:

ఈ నెల 9వ తేదిన ఫిలిం నగర్ JRC కన్వెన్షన్ సెంటర్ లో జరగనున్న సాయి ధరం తేజ్ సినిమా “తేజ్ ఐ లవ్ యు” ఆడియో రిలీజ్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నాడు.
వరుస ఫ్లాప్స్ తో నిరుత్సాహంలో ఉన్న సాయి ధరం తేజ్ లో చిరంజీవి రాక మంచి ఉత్సాహం నింపెదే..

వరుసగా మూడు హిట్లు తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులతో డీలా పడి పోయిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కి రిలీజ్ కాబోతున్న “తేజ్ ఐ లవ్ యు” సినిమా విజయం చాల ముఖ్యం. అందుకే ఈ సినిమాకి వీలైనంత ఎక్కువ పబ్లిసిటీ చేయాలని డిసైడ్ అయిపోయాడు. అందులో భాగంగా ఈ నెల 9 న జరగనున్న ఆడియో ఫంక్షన్ ని ఘనంగా నిర్వహించాలని నిర్మాతకు చెప్పెసాడు సాయి. ఇక ఈ సినిమాకి ముఖ్య అతిధిని తీసుకొచ్చే భాద్యత మాత్రం సాయిదే..!

మరి ఇప్పుడు సాయి కోసం మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొస్తారు అంటే అందరి కంటే మెగాస్టార్ చిరంజీవి పేరే అందరికీ గుర్తొస్తుంది. చిరంజీవి అయితేనే సినిమా గురించి అభిమానుల్లోకి సరైన విధంగా చేర్చగలరు కాబట్టి సాయి మొదటి ఛాయస్ చిరంజీవే... అందుకనుగుణంగా చిరంజీవి కూడా మేనల్లుడి కోసం వస్తున్నారు. రంగస్థలం తర్వాత చిరంజీవి అటెండ్ అవుతున్న ఫంక్షన్ ఇదే...

chiranjeevi as chief guest for tej i love u audio release

Tags : Tej I Love U Audio Launch Chief Guest, Sai Dharam Tej, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel